BJP mocks Rahul as NDA inches towards victory | బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బీహార్ లో ప్రభంజనం సృష్టించే దిశగా వెళ్తుంది. 243 స్థానాలు ఉన్న బీహార్ లో 190కి పైగా సీట్లలో ఎన్డీయే అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతున్నారు. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఘోర పరాజయం దిశగా పయనిస్తున్నాయి.
ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఇండీ కూటమిపై విమర్శలు, సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత అమిత్ మాల్వియ స్పందిస్తూ బీహార్ ఎన్నిక ఫలితాల ద్వారా రాహుల్ గాంధీ 95వ ఓటమిని చవిచూశారని ఎద్దేవా చేశారు. 2004 నుంచి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఐదు తక్కువ సెంచరీ ఓటములను చవిచూశారని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీకి మరో ఎన్నిక, మరో ఓటమి బీహార్ ఎన్నికలు 95వ ఓటమి, సెంచరీ చేయడానికి ఐదు తక్కువ అంటూ అమిత్ మాలవియా సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ ఓటములను చూసి పరాజయం సైతం ఆశ్చర్యపోతుందని, ఎన్నికల ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే రాహుల్ గాంధీ ఈపాటికే ఎన్నో బిరుదులు అందుకునే వారని ఈ బీజేపీ నేత విమర్శలు గుప్పించారు.









