BCCI Central Contract 2025 | 2024-24 ఏడాదికి సంబంధించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. శ్రేయస్ ఐయ్యర్, ఇషాన్ కిషన్ తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులో చోటు సంపాదించారు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి ఈ జాబితాలో అవకాశం లభించింది.
మొత్తం 34 ప్లేయర్లను నాలుగు కేటగిరిల్లో విభజించారు. టాప్ గ్రేడ్ అయిన A+ లో నలుగురి క్రికెటర్లకు చోటు లభించగా ఇందులో ముగ్గురు ఇప్పటికే టీ-20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఈ గ్రూప్ లో ఉన్నారు.
వీరికి రూ.7 కోట్ల వార్షిక వేతనం లభించనుంది. ఇకపోతే A గ్రేడ్ లో ఆరుగురిని బీసీసీఐ ఎంపిక చేసింది. హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, మహమ్మద్ సిరాజ్, షమీ ఉన్నారు. వీరికి రూ.5 కోట్ల వేతనం దక్కనుంది. టీ-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ ఐయ్యర్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్,కుల్దీప్ యాదవ్ బీ గ్రేడ్ లో ఉన్నారు. వీరికి రూ.3 కోట్ల వార్షిక వేతనం దక్కనుంది.
అత్యధిక ప్లేయర్లు గ్రేడ్ సీ లో ఉన్నారు. ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తున్న యువ ఆటగాళ్లు ఇందులో ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఇందులోనే ఉన్నారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ ధూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, రజత్ పటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, ఆర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తికి అవకాశం దక్కింది. వీరికి రూ.కోటి వార్షిక వేతనం లభిస్తుంది.