Bandi Sanjay On Rajamouli | గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెల్సిందే. తాజగా రాజమౌళి హనుమంతుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడారు.
ఎవరి ఆలోచన వాళ్ళది అని బండి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. అలాగే భవిష్యత్ లో రాజమౌళి దేవుడిని నమ్మే విధంగా భగవంతుడు కరుణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రాజమౌళిపై దేవుడి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకున్నారు. నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో రాజమౌళి భవిష్యత్ లో మరిన్ని విజయాలు అందుకుని అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా ఎల్ఈడీ స్క్రీన్ గ్లిచ్ మూలంగా కాసేపు ఆగిపోయింది. ఈ క్రమంలో మాట్లాడిన రాజమౌళి తనకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదని కానీ తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ భగవంతుడు వెనకాల ఉంటూ గుండెతట్టి నడిపిస్తాడు అని అనగానే తనకు చాలా కోపం వచ్చిందని రాజమౌళి కామెంట్ చేశారు.









