Ambati Rayudu Backs Virat Kohli | టీం ఇండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. సుమారు పుష్కర సమయం తర్వాత విరాట్ కోహ్లీ రంజీలోకి ఎంట్రీ ఇచ్చారు.
కానీ రైల్వేస్ ( Railways ) తో జరిగిన మ్యాచులో కోహ్లీ నిరాశపరిచాడు. కేవలం ఆరు పరుగుల వద్దే ఔట్ అయ్యాడు. 12 సంవత్సరాల తర్వాత రంజీలో విరాట్ కోహ్లీని చూసేందుకు అభిమానులు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియాని ( Arun Jaitley Stadium )కి క్యూ కట్టారు.
ఆరు పరుగుల వద్దే కోహ్లీ ఔట్ అవ్వడంతో అభిమానులు సైతం నిరాశ చెందారు. కానీ మిగిలిన ప్లేయర్లు రాణించడంతో రైల్వేస్ పై ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఇదిలా ఉండగా విరాట్ కోహ్లీ ఫార్మ్ పై వస్తున్న విమర్శలపై అంబటి రాయుడు తనదైన శైలిలో స్పందించారు.
‘ప్రస్తుతం విరాట్ కోహ్లీకి రంజీ అవసరం లేదు. ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో 81 సెంచరీలతో కోహ్లీ టెక్నిక్ ( Technic ) బాగుంది. భవిష్యత్ లో కూడా భాగానే ఉంటుంది. ఎవ్వరూ అతడిపై ఒత్తిడి తీసుకురావద్దు. తిరిగి పుంజుకోవడానికి అతనికి సమయం కావాలి. కోహ్లీ లోపల ఉన్న జ్వాల దానంతట అదే మండుతుంది. అతనిపై గౌరవం నమ్మకం ఉంచండి చాలు. మరీ ముఖ్యంగా కోహ్లీని ఒంటరిగా వదిలెయ్యండి’ అంటూ అంబటి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.