Samantha | ఇటీవల రాజాసాబ్ (Rajasaab) సినిమా పాట విడుదల సందర్భంగా అభిమానుల అత్యుత్సాహం వల్ల హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా నటి సమంత (Samantha) కు కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైంది.
హైదరాబాద్‌లో ఓ షోరూమ్ ఓపెనింగ్ కు సమంత హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళుతున్న ఆమెను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఆమెను చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
దాంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పి, ఆమె కారు వరకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. తన వ్యక్తిగత సెక్యూరిటీ మధ్య అతికష్టం మీద అక్కడి నుంచి సమంత బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఫ్యాన్స్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.





