Actor Darshan arrested hours after SC cancels his bail | కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడను కర్ణాటక పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
తమ అభిమాని రేణుక స్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడలు నిందితులుగా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్ లో ఆ రాష్ట్ర హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తాజగా విచారణ చేపట్టి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెంగళూరులో దర్శన్ మరియు పవిత్ర గౌడలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలాగే చట్టానికీ ఎవరూ అతితీలు కాదని, జైలులో దర్శన్ కు ఎలాంటి వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వొద్దని సుప్రీం స్పష్టం చేసింది. ఒకవేళ జైలులో దర్శన్ కు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే జైలు సూపరింటెండెంట్ పై చర్యలు తప్పవని న్యాయస్థానం హెచ్చరించింది.









