Sunday 11th January 2026
12:07:03 PM
Home > క్రీడలు > అభిషేక్ ఊచకోత..సిక్సర్ల మోత

అభిషేక్ ఊచకోత..సిక్సర్ల మోత

Abhishek Sharma smacks 32-ball century in Syed Mushtaq Ali Trophy | విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటును ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సర్ల మోత మోగిస్తూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ లో ఆదివారం ఉదయం పంజాబ్-బెంగాల్ మధ్య మ్యాచ్ జరిగింది.

పంజాబ్ జట్టుకు అభిషేక్, బెంగాల్ జట్టుకు మహమ్మద్ షమీ కెప్టెన్లు గా వ్యవహారిస్తున్నారు. తొలుత పంజాబ్ బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో ఆది నుండే అభిషేక్ ఊచకోత మొదలైంది. కేవలం 12 బంతుల్లోనే 5 ఫోర్లు, ఐదు సిక్సులతో హాఫ్ సెంచరీ మార్కును చేరిన అభిషేక్, 32 బంతుల్లోనే సెంచరీ చేశాడు. షమీ బౌలింగ్ లో ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. మొత్తంగా 52 బంతుల్లో 16 సిక్సులు, ఎనమిది ఫోర్లతో 148 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు ప్రభసిమ్రన్ సింగ్ నుంచి కూడా మంచి మద్దతు లభించడంతో పంజాబ్ జట్టు 20 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇది రెండవ అత్యధిక స్కోర్. అలాగే కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ తన మెంటర్ యువరాజ్ సింగ్ సరసన నిలిచాడు. 2007 టీ-20 వరల్డ్ కప్ లో ఒకే ఓవర్ లో ఆరు సిక్సులు బాధిన మూవీ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇకపోతే బెంగాల్ నిర్ణీత ఓవర్లలో కేవలం 198 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలయ్యింది.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions