First flight lands successfully at Bhogapuram International Airport | ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం తొలి విమానం ల్యాండ్ అయ్యింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన వ్యాలిడేషన్ (టెస్టు) ఫ్లైట్ భోగాపురంలో ఉదయం ల్యాండ్ అయ్యింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏవియేషన్ అధికారులు, జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. 2026 జూన్ లో ఈ విమానాశ్రయం ప్రారంభం కానుంది.








