Security Breach at Tirupati Govindaraja Swamy Temple | తిరుపతిలో ఓ మందుబాబు చేసిన హంగామా అంతాఇంతా కాదు. మద్యం కోసం ఈ మందుబాబు ఏకంగా ఆలయ గోపురం పైకి ఎక్కి నానాయాగి చేశాడు. సుమారు మూడు గంటలు శ్రమించి పోలీసులు, విజిలెన్స్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మందుబాబును కిందకు లాక్కొచ్చారు. శనివారం తెల్లవారుజామున తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలోకి ఓ మందుబాబు చొరబడ్డాడు. విజిలెన్స్ అధికారులు కళ్లుగప్పి గోడ దూకి అలయంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత గోవిందరాజ స్వామివారి ఆలయ గోపురంపైకి ఎక్కాడు. అక్కడ కలశాలను తొలగించే ప్రయత్నం చేశాడు.
మందుబాబును గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యింది. మద్యం బాటిల్ ఇస్తేనే కిందకు దిగుతా అంటూ షరతు విధించాడు. దింతో మందు బాటిల్ ఇస్తామని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మందుబాబు పట్టించుకోలేదు. ఈ క్రమంలో పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది ఆపరేషన్ ను చేపట్టాయి. నిచ్చెన సహాయంతో గోపురం పైకి ఎక్కి మందుబాబుని కిందకు లాక్కొచ్చారు. అయితే తాను ఫుల్ బాటిల్ డిమాండ్ చేయలేదని కేవలం 90 ఎంఎల్ మాత్రమే కోరినట్లు మందుబాబు వివరణ ఇచ్చాడు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు.









