KIMS Clarity on Adoni Medical College Tender | మెడికల్ కాలేజి కోసం ‘కిమ్స్’ బిడ్ వేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇందులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. పబ్లిక్ ప్రైవేట్ పాట్నరషిప్ లో మెడికల్ కాలేజీలను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తొలుత ఆదోని, మార్కాపురం, పులివెందుల, మదనపల్లెలోని మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పోరేషన్ టెండర్లను ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆదోని మెడికల్ కాలేజి కోసం హైదరాబాద్ కు చెందిన కిమ్స్ సంస్థ బిడ్ దాఖలు చేసినట్లు ప్రచారం జరిగింది.
అయితే ఇందులో వాస్తవం లేదని కిమ్స్ స్పష్టం చేసింది. తాము ఏ బిడ్ వేయలేదని, అసలు ఆ ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా పీపీపీ మోడల్ కు వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమించిన విషయం తెల్సిందే. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేసే కుట్ర ఇది అని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. అంతేకాకుండా ఎవరైనా బిడ్ వేస్తే వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే జైలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరికలు జారీ చేశారు.









