Dhurandhar storms into the Rs.1000 crore worldwide club | రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధరే తెరకెక్కించిన ధురందర్ సినిమా థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. డిసెంబర్ ఐదున విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్ల వద్ద సందడి చేస్తుంది. ఇదే సమయంలో ధురందర్ రూ.1000 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈ సినిమా నిలిచింది.
రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ 21వ రోజు కూడా 4500పైగా థియేటర్లలో ఆడుతుంది. ఇకపోతే రణవీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య కెరీర్ లో అత్యధిక వసూళ్లు చెసిన సినిమా ఇదే కావడం విశేషం. ఇకపోతే వచ్చే ఏడాది మార్చి 19న ధురందర్ పార్ట్ 2 విడుదల కానుంది. హిందీతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.









