Australia lead England by 46 after 20 wickets fall on day one | ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరీస్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు బూడిద కోసం పోటీ పడతాయి. అయితే ఆస్ట్రేలియా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ మాత్రం చప్పగా సాగుతుంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచులను గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ ను కైవసం చేసుకుంది. శుక్రవారం నుంచి మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ మొదలైంది. అయితే ఇరు జట్లు తమ తొలి ఇన్నింగ్స్ లో ఆల్ అవ్వడం, అది కూడా ఫస్ట్ డే నే ఇలా జరగడం పట్ల క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
టాస్ ఓడి ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. కేవలం 45 ఓవర్లలోనే ఆస్ట్రేలియా జట్టు ఆల్ ఔట్ అయ్యింది. 152 పరుగులకే చేసి ఆల్ ఔట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు ఘోరంగా విఫలం అయ్యింది. 30 ఓవర్లలోనే బ్యాటర్లు అందరూ పెవిలియన్ బాట పట్టారు. 110 పరుగులకే జట్టు ఆల్ ఔట్ అయ్యింది. ఇలా నాలుగవ టెస్టు తొలి రోజే రెండు జట్లు ఆల్ అయ్యాయి. దింతో ఇలా ఆడితే టెస్టు మ్యాచులపై ఆసక్తి పోతుందని పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.









