- ఏడాదికి ఎంత ఖర్చు పెడుతున్నారంటే!
Telangana Tops In Liquor | తెలంగాణలో ఏ చిన్న వేడుక జరిగినా మాంసం, మద్యం ఉండాల్సిందే. ముక్క, చుక్క లేని ధావత్ లు ఉండవంటే అతిశయోక్తి లేదు. మద్యపానంలో పెట్టింది పేరుగా మారింది తెలంగాణ. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం వినియోగంలో తెలంగాణ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో తలసరి మద్యం వినియోగం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఏడాదికి సగటు తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లుగా ఉండగా, కర్ణాటక 4.25 లీటర్లు , తమిళనాడు 3.38 లీటర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఏపీ 2.71 లీటర్లతో నాలుగో స్థానంలో ఉండగా, కేరళ 2.53 లీటర్లతో చివర్లో నిలిచింది. తెలంగాణలో బీరు వినియోగం గత ఏడాది కాలంలో అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో ఒక్కొక్కరు ఏడాదికి సగటున రూ.11,351లు మద్యం కొనుగోలుకు ఖర్చు చేస్తున్నారు.
ఇది దేశంలోనే అత్యధికం. ఏపీలో సగటు వ్యక్తి ఏడాదికి రూ.6,399 ఖర్చు చేస్తున్నారు. ఈ భారీ మద్యం విక్రయాలతో తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు ఏటా సుమారు రూ.36,000 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. అయితే తెలంగాణలో పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే వినియోగం అధికంగా ఉంది.









