Sarpanch Turns Into a Bear For Monkeys | కోతుల బెడద నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకు నూతనంగా ఎన్నికైన ఓ సర్పంచ్ సరికొత్త ఆలోచనతో ముందుకువచ్చారు. ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామం నుంచి కోతులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. సర్పంచ్ వినూత్న ఆలోచన పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయితే తమ తమ గ్రామాల్లో సర్పంచ్ గా గెలిచేందుకు పోటీ చేసిన అభ్యర్థులు ప్రజలపై హామీల వర్షం కురిపించారు.
అనేక గ్రామాల ప్రజలను కోతుల బెడద వెంటాడుతుంది. ఈ క్రమంలో తాము సర్పంచ్ గా గెలిస్తే కోతుల బెడదను తప్పిస్తామని చాలా మంది అభ్యర్థులు హామీ ఇచ్చారు. ఇలా హామీ ఇచ్చిన నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన కుమ్మరి రంజిత్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామ నలుమూలల్లో తిరిగారు. ఎలుగుబంటిని చూడగానే కోతులు పరుగందుకున్నాయి. సర్పంచ్ ఆలోచన అభినందనలకు కారణం అయ్యింది. ఎలుగుబంటి వేషం ధరించి ఆయన గ్రామంలో కోతులు సంచరిస్తున్న ప్రాంతాల్లో తిరిగారు. అనంతరం వాటిని బెదిరించారు. ఎలుగుబంటిని చూసిన కోతులు పరుగందుకున్నాయి. దింతో గ్రామస్థులు సర్పంచ్ ను అభినందిస్తున్నారు.









