Monday 12th January 2026
12:07:03 PM
Home > తాజా > గండిపేట జలాశయంలో మురుగునీరు..క్లారిటీ

గండిపేట జలాశయంలో మురుగునీరు..క్లారిటీ

A Septic Tank Truck Caught Dumping Waste Directly in Gandipet | హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన వనరు అయిన గండిపేట జలాశయంలో అక్రమంగా మురుగునీటిని పారబోయాలని ప్రయత్నించిన ఘటన తీవ్ర కలకలం రేగింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పందించారు. ప్రజలేవరు ఆందోళన చెందవద్దన్నారు. మురుగునీటిని పారబోయడానికి యత్నించిన ప్రైవేట్ సెప్టిక్ ట్యాంకర్‌ను జలమండలి అధికారులు పట్టుకున్నారని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

విచారణ సమయంలో డ్రైవర్ రామవత్ శివ నాయక్ మరియు హిమాయత్ నగర్ నివాసి నిరంజన్ ఆదేశాల మేరకు ఈ అక్రమ పనికి పాల్పడినట్లు అంగీకరించారని వెల్లడించారు. అలాగే ట్యాంకర్‌పై ఎటువంటి అనుమతి లేకుండా HMWSSB లోగోను వినియోగించారని ప్రజలను మరియు అధికారులను నమ్మించి, తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా మోసపూరితంగా లోగోను వాడినట్లు తేలిందన్నారు. ఉస్మాన్ సాగర్ ఎలాంటి వ్యర్థాలు కలవలేదని, ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions