Nara Lokesh News | మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులతో పోటీ పడడం ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కష్టం అని అన్నారు. తాజగా ముఖ్యమంత్రి చంద్రబాబును ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారంతో ప్రముఖ సంస్థ ఎకనామిక్ టైమ్స్ సత్కరించిన విషయం తెల్సిందే. తండ్రికి ఈ గౌరవం లభించడం పట్ల తనయుడు లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. అయితే కుటుంబ సభ్యులందరూ వివిధ రంగాల్లో అవార్డులను సొంతం చేసుకుంటున్నారని వారితో పోటీ పడడం తనకు కష్టంగా ఉందని లోకేశ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
‘తండ్రి ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలిచారు. అమ్మ ‘గోల్డెన్ పీకాక్’ పురస్కారాన్ని ఇంటికి తీసుకువచ్చారు. సతీమణి బ్రాహ్మణి ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ లో ఒకరు. తనయుడు దేవాన్ష్ చెస్ ఛాంపియన్. కుటుంబ సభ్యులతో పోటీ పడడం ఎన్నికలను ఎదుర్కోవడం కంటే కష్టం అని నేను గుర్తించాను’ అని లోకేశ్ సరదాగా పోస్ట్ చేశారు.









