CM Chandrababu Gets ‘Business Reformer Of The Year’ Award | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో చంద్రబాబును సత్కరించింది ప్రముఖ ఎకనామిక్ టైమ్స్ సంస్థ. ఈ మేరకు చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ముఖ్యమంత్రికి అరుదైన గౌరవం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
‘మా కుటుంబానికి మరియు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన క్షణం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎకనామిక్ టైమ్స్ సంస్థ నుండి ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’గా సత్కరించబడ్డారు. కొద్దిమంది నాయకులు మాత్రమే భారతదేశ సంస్కరణల ప్రయాణాన్ని ఇంత స్పష్టత, ధైర్యం మరియు స్థిరత్వంతో రూపొందించారు. ఈ అవార్డు ఆయన సంస్కరణలు, వేగం మరియు పాలనలో విశ్వాసం పట్ల అచంచలమైన దృష్టికి, నమ్మకానికి నిదర్శనం’ అని లోకేశ్ వెల్లడించారు.









