First Jumma Prayer at Proposed Babri Mosque Site | త్రినముల్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ఇటివలే బాబ్రీ మసీదు పోలే విధంగా నిర్మించ తలపెట్టిన మసీదుకు పునాది రాయి వేసిన విషయం తెల్సిందే. శుక్రవారం ఈ ప్రాంతం వద్ద జరిగిన ప్రార్థన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. వెస్ట్ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగా ప్రాంతంలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ ఆరున ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ నూతన మసీదుకు పునాది రాయి వేశారు.
ఈ కార్యక్రమంలో లక్షలాది పాల్గొన్నట్లు కథనాలు వచ్చాయి. నూతనంగా నిర్మించబోయే మసీదు బాబ్రీ మసీదును పోలే విధంగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందుకోసం విరాళాలు వసూలు చేస్తున్నారు. మసీదు నిర్మిస్తున్న ప్రాంతంలో ప్రత్యేక విరాళం బాక్సులు, క్యూఆర్ కోడ్ లు కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. ఇకపోతే శుక్రవారం జరిగిన ప్రార్థనల్లో పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చారు. వెస్ట్ బెంగాల్ లోని ముర్షిదాబాద్ అత్యంత సున్నితమైన ప్రాంతం అనే విషయం తెల్సిందే. బాబ్రీ మసీదు నిర్మాణం ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టీఎంసీ నుండి సదరు ఎమ్మెల్యేను బహిష్కరించారు.









