Nitish Reddy picks hattrick but Andhra lose | సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ఫీట్ ను సాధించారు నితీష్ కుమార్ రెడ్డి. హ్యాట్రిక్ వికెట్లు తీశారు. ఈ క్రమంలో కెప్టెన్ రజత్ పటిదార్ ను క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అయినప్పటికీ ఆంధ్రా జట్టు ఓటమిని చవిచూసింది. ట్రోఫీలో భాగంగా శుక్రవారం పూణే వేదికగా ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఏపీ 112 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది.
113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ జట్టును ఆదిలోనే దెబ్బతీశారు నితీష్. తొలుత హార్ష్ గవాలిని బౌల్డ్ చేశారు. ఆ తర్వాత హార్ప్రీత్ సింగ్ ను ఔట్ చేశారు. ఆ తర్వాత బంతికే ఆర్సీబీ కెప్టెన్, అలాగే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్ సారథి రజత్ పటిదార్ ను క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ ను ఖాతాలో వేసుకున్నారు నితీష్. ఇది టీ-20ల్లో నితీష్ కు తొలి హ్యాట్రిక్. అయినప్పటికీ ఆంధ్రా జట్టుకు ఓటమి తప్పలేదు. 113 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించిన మధ్యప్రదేశ్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.









