Ranveer Singh’s Dhurandhar has been banned across six Gulf countries | ఓ ఇండియన్ సినిమాను ఆరు గల్ఫ్ దేశాలు బ్యాన్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన సినిమా ‘ధురందర్’. ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. రూ.200 కోట్ల కలెక్షన్ల దిశగా ఈ మూవీ వెళ్తోంది. ఇదే సమయంలో ఈ మూవీని గల్ఫ్ దేశాలు నిషేధించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
యాంటీ పాకిస్థాన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని పేర్కొంటూ ఆరు గల్ఫ్ దేశాలు బహ్రేయిన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, ఒమన్ వంటి దేశాల్లో ఈ మూవీని నిషేధించినట్లు సమాచారం. యాంటీ పాకిస్థాన్ గా ధురంధర్ తెరకెక్కిందని పేర్కొంటూ సినిమా విడుదల కోసం అనుమతులు ఇచ్చేందుకు ఈ దేశాలు నిరాకరించినట్లు సమాచారం. గల్ఫ్ దేశాల్లో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నించగా అనుమతులు రాలేదని తెలుస్తోంది. గతంలో ఆర్టికల్ 370, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలకు ఇలానే జరిగింది.









