Pinnelli Brothers Surrendered In Macharla Court | జంట హత్య కేసుకు సంబంధించి మాచర్ల కోర్టులో లొంగిపోయారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి. ఈ నేపథ్యంలో కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావుల హత్య కేసులో పిన్నెల్లి సోదరులను ఏ6, ఏ7 గా ఉన్నారు.
అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయగా సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. రెండు వారాల్లోగా మాచర్ల కోర్టులో లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గురువారం పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోయారు









