Messi’s GOAT India tour schedule | అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది వీరాభిమానులను సొంతం చేసుకున్న లియోనల్ మెస్సి భారత్ కు రానున్న విషయం తెల్సిందే. మూడు రోజుల ఈ పర్యటన బిజీ బిజీగా సాగనుంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెస్సిని కలుస్తారు.
డిసెంబర్ 13 తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తలో మెస్సి ల్యాండ్ అవుతారు. విర్చువల్ గా మెస్సి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీం ఇండియా లెజెండరీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ మరియు బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ ను మెస్సి కలుస్తారు. అదే రోజు హైదరాబాద్ కు వస్తారు. ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇందులో పాల్గొనడం విశేషం.
ఆ తర్వాత ఫలకనామ ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉంటుంది. మరుసటి రోజు ముంబైకి మెస్సి వెళ్తారు. ఇక్కడ చారిటీ కోసం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ఫండ్స్ రైస్ చేస్తారు ఈ ఫుట్బాల్ లెజెండ్. ఇకపోతే తన పర్యటన చివరి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మెస్సి భేటీ అవుతారు. ఇలా మూడు రోజుల పర్యటనలో భాగంగా కోల్కత్త, హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ నగరాలను సందర్శిస్తారు. ఇకపోతే మెస్సి రాకకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఏర్పాట్లు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి.









