Honour To Pawan Kalyan | ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అరుదైన గౌరవం లభించింది. ఆయణ్ని ‘అభినవ కృష్ణదేవరాయ’ అనే బిరుదు వరించింది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకలో పర్యటించారు.
అందులో భాగంగా ఉడిపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆహ్వానం మేరకు ‘బృహత్ గీతోత్సవ’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కు ‘అభినవ కృష్ణదేవరాయ’ బిరుదును ప్రధానం చేశారు మఠాధిపతి.
అనంతరం పవన్ ప్రసంగించి కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం మూఢనమ్మకం కాదని ఆధ్యాత్మిక శాస్త్రం అని పేర్కొన్నారు. భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదన్నారు. తమిళనాడులో ధర్మాన్ని అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు.









