Kangana Ranaut, Mahua Moitra, Supriya Sule Dance At Naveen Jindal’s Daughter’s Wedding | భారతీయ జనతా పార్టీ ఎంపీ కుమార్తె వివాహంలో ప్రతిపక్ష ఇండీ కూటమి ఎంపీలు డాన్స్ చేశారు. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే బీజేపీ, ప్రతిపక్ష ఎంపీలు కలిసి డాన్స్ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. హర్యానా నుంచి లోకసభకు ఎన్నికైన బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ కుమార్తె యశస్విని జిందాల్-శశ్వత్ సోమానిల వివాహం ఢిల్లీలో ఘనంగా జరిగింది.
ఇందులో రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలో భాగంగా బీజేపీ ఎంపీలు వధువు తండ్రి నవీన్ జిందాల్, హిమాచల్ ప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కంగనా రనౌత్ అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, శరద్ పవార్ తనయ సుప్రియ సూలే, త్రినముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కలిసి డాన్స్ చేశారు. బాలీవుడ్ పాటలకు వీరు డాన్స్ వేశారు.
అంతకంటే ముందు ఈ ఎంపీలు కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. పార్లమెంటులో అలాగే బయట బీజేపీ పై నిత్యం విరుచుకుపడే మహువా మొయిత్రా, సుప్రియా సూలే ఇలా బీజేపీ ఎంపీ కుమార్తె వివాహంలో డాన్స్ చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇకపోతే నవీన్ జిందాల్ గతంలో కాంగ్రెస్ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.









