Attack On RTC Bus Driver | రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద మా ఆర్టీసీ డ్రైవర్‌పై మరో వ్యక్తి దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన, బెదిరింపులకు దిగిన, దాడులు చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్ ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసులను నమోదు, హిస్టరీ షీట్స్ కూడా తెరిచే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.
ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉంటుందని పాస్ పోర్టు జారీకి, ప్రభుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయని క్షణికావేశంలో ఏ చిన్నతప్పు చేసిన జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాయని సజ్జనర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటనను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.









