Telangana releases Rs.13 crore as immediate assistance to families hit by cyclone Montha | తెలంగాణ రాష్ట్రంలో మోంథా తుఫాను ప్రభావంతో 16 జిల్లాల్లో భారీ వర్షాలు, వరద వల్ల నష్టపోయిన వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.12.99 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలతో దెబ్బతిన్న ఇళ్ళకు రూ.15,000 చొప్పున సాయం అందిస్తూ రెవిన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లా కలెక్టర్లు పంపించిన నివేదికల ప్రకారం 15 జిల్లాల్లో 8662 ఇండ్లు దెబ్బతిన్నాయి. వీరికి తక్షణ సాయంగా రూ.12.99 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అక్టోబర్ 27 నుంచి 30 వరకు వరుసగా నాలుగు రోజులు కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో 16 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.









