China’s Newly Constructed Hongqi Bridge Collapses | చైనా దక్షిణపశ్చిమ భాగం సిచువాన్ ప్రాంతం లో నూతనంగా నిర్మించిన ఓ భారీ వంతెన తాజగా కుప్పకూలింది. దీనికి సంబంధించిన భయానక దృశ్యాలు వైరల్ గా మారాయి. మార్కాంగ్ నగరంలో హాంగ్కీ వంతెన భాగం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ వంతెన, షువాంగ్జి యాంగ్కౌ హైడ్రోపవర్ స్టేషన్ సమీపంలో ఉంది.
అలాగే ఈ వంతెన దేశ రాజధాని బీజింగ్ ను టిబెట్ తో అనుసంధానించే జాతీయ రహదారిలో భాగం. ఈ వంతెన పొడవు 758 మీటర్లు, ఇది కేవలం కొన్ని నెలల ముందు మాత్రమే పూర్తయ్యి అందుబాటులోకి వచ్చింది. వంతెన సమీపంలో కొండచరియలు, భూగర్భంలో పరిణామాలను గమనించిన అధికారులు సోమవారం నాడు వంతెనపైకి వాహనాల అనుమతిని నిరాకరించారు.
దింతో భారీ ప్రమాదం తప్పింది. ఇకపోతే కొండచరియలు విరిగిపడడం, భూగర్భ సమస్యల మూలంగా ఈ వంతెన కూలిందా లేదా నిర్మాణంలోనే లోపం ఉందా అని కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.









