Ravi Shastri backs Ravindra Jadeja for 2027 ODI World Cup | 2027 వన్డే ప్రపంచ కప్ లో భాగంగా టీం ఇండియా తరఫున ఆడబోయే ప్లేయర్ల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. భారత సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ టీంలో ఉంటారా ఉండారా అనే సందిగ్ధత నెలకొంది.
ఇదే సమయంలో మాజీ ప్లేయర్ రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 వరల్డ్ కప్ జట్టులో ఆల్ రౌండర్ రవింద్ర జడేజా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా టూర్ కోసం జడేజాను ఎంపిక చేయలేదు. అతని స్థానంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. దీనిపై స్పందించిన రవి శాస్త్రి మూడు మ్యాచుల వన్డే సిరీస్ కోసం జడేజా స్థానంలో అక్షర్ ను ఎంపిక చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చన్నారు.
కానీ 2027 వరల్డ్ కప్ లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని శాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. సౌత్ ఆఫ్రికా వేదికగా జరగబోయే ప్రపంచ కప్ లో అనేక దేశాలపై, వివిధ రకాల పిచ్ లపై ఆడాల్సి ఉంటుందని ఇక్కడే జడేజా అనుభవం ఉపయోగ పడుతుందన్నారు. 2027 వరల్డ్ కప్ టీం ప్లాన్ కచ్చితంగా జడేజా ఉంటాడని శాస్త్రి ధీమా వ్యక్తం చేశారు. అతడి ఫీల్డింగ్ చూస్తుంటే అతని వయస్సు కంటే 8 ఏళ్లుగా చిన్నగా కనిపిస్తాడని జడేజాపై ప్రశంసలు కురిపించారు.









