FSSAI restores ban on fake ‘ORS’ drinks | ఓఆర్ఎస్. డీహైడ్రేషన్ బారిన పడిన సమయంలో ఓఆర్ఎస్ తాగితే మంచిది. దీన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో ఎలక్ట్రో లైట్లు భర్తీ అవుతాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఎలక్ట్రో లైట్ లు తగిన మోతాదులో ఉండాలి.
విరేచనాలు, వాంతులు అయ్యే సమయంలో ఓఆర్ఎస్ ను అధికంగా వినియోగిస్తారు. కానీ కంపెనీలు తమ స్వార్ధ లాభాల కోసం నకిలీ ఓఆర్ఎస్ ను అమ్ముతున్నాయి. ఓఆర్ఎస్ పేరుతో షుగర్ ఎక్కువగా ఉండే ఎనర్జీ డ్రింక్స్ ను అమ్ముతున్నారు. దీని మూలంగా విరేచనాలు ఇంకా పెరుగుతాయి. మెదడుపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో గత ఎనమిది ఏళ్లుగా హైదరాబాద్ కు చెందిన పిల్లల డాక్టర్ శివరంజనీ నకిలీ ఓఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
ఈ మేరకు హై కోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యం కూడా వేశారు. ఈ క్రమంలో తాజగా ఆమె చేసిన పోరాటం ఫలించింది. షుగర్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ మీద ఓఆర్ఎస్ పదాన్ని, ముద్రను వినియోగించకూడదని ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజగా మార్గదర్శకాలు జారీ చేసింది. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శల మేరకు ఉన్న వాటిపైనే ఓఆర్ఎస్ ఉండలాని ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు డాక్టర్ శివరంజని కృషి, పోరాటం ఘన విజయం సాధించాయి.









