Telangana Bandh Today Over Backward Classes Reservation Issue | స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం శనివారం బీసీ సంఘాలు తెలంగాణ బంద్ ను ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని రంగాలు బంద్ పాటిస్తున్నాయి.
బీసీ సంఘాల నేతలు రోడ్లపై బైఠాయించి న్యాయమైన 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని నినాదాలు చేస్తున్నారు. ఈ బంద్ కు అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్, వామపక్ష పార్టీలు మరియు ఎమ్ఆర్పీఎస్, మాల మహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, ప్రజా విద్యార్థి సంఘాలు మద్దతుగా బంద్ లో పాల్గొన్నాయి. అంబర్పెటలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బంద్ విజయవంతం అయ్యిందని ప్రకటించారు. ఇదిలా ఉండగా సోమవారం దీపావళి.
శనివారం నుంచి వీకెండ్ ప్రారంభం కావడంతో ప్రయాణికులు స్వగ్రామలకు వెళ్లేందుకు బస్సుల కోసం వేచి చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు క్యాబ్ డ్రైవర్లు డబుల్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు.









