Minister Konda Surekha Controversy | మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం అర్ధరాత్రి మంత్రి ఇంటివద్ద హై డ్రామా నెలకొన్న విషయం తెల్సిందే. మాజీ ఓఎస్డీ సుమంత్ ను అదుపులోకి తీసుకోవడానికి మఫ్టీలో పోలీసులు రాగా వారితో సుష్మిత వాగ్వాదానికి దిగారు.
ఇంటి లోపలికి అనుమతించేదే లేదని ఖరా ఖండిగా చెప్పారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాతూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు వేం నరేందర్ రెడ్డి కలిసి తమ కుటుంబం మీద కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తన నాన్న కొండా మురళిని అరెస్ట్ చేసి, అమ్మను మంత్రి పదవి నుండి పీకేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలోని రెడ్డిలు అంతా కలిసి బీసీలను తొక్కేస్తున్నారని బాంబు పేల్చారు.









