Virat Kohli’s cryptic post after landing in Australia ends retirement rumours | టీం ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీ-20, టెస్టులకు ఆయన వీడ్కోలు పలికిన విషయం తెల్సిందే. 2027 వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా కోహ్లీ సన్నద్ధమవుతున్నారు.
అలాగే అక్టోబర్ 19 నుంచి ప్రారంభం అయ్యే ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఇప్పటికే కోహ్లీ టీం ఇండియాతో కలిసి ఆ దేశంలో అడుగుపెట్టాడు. ఈ సిరీస్ లో భాగంగా మూడు వన్డేలు జరగనున్నాయి. అయితే ఈ సిరీస్ లో రాణిస్తేనే కోహ్లీకి వన్డేల్లో స్థానం సుస్థిరం అవుతుందని, ఒకవేళ విఫలం అయితే మాత్రం భవిష్యత్ అవకాశాలు సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని పలువురు మాజీలు విశ్లేషణలు చేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కోహ్లీ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ‘నిజంగా విఫలమయ్యే సమయం ఏమిటంటే, మనం పూర్తిగా వదిలెయాలని అనుకున్నప్పుడే’ అని అర్ధం వచ్చేలా కోహ్లీ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.








