PM Modi Srisailam Tour | ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన కొనసాగుతుంది. గురువారం ఉదయం కర్నూలు విమానాశ్రయం చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.
అనంతరం ఈ ముగ్గురు ఒకే హెలికాప్టర్ లో శ్రీశైలం బయలుదేరారు. అనంతరం శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కి ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని ప్రధాని దర్శించుకున్నారు.
ఆ తర్వాత శివాజీ దర్బార్ హాల్, ధ్యాన కేంద్రాన్ని ప్రధాని తిలకించారు. ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే ‘సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.









