Sunday 11th January 2026
12:07:03 PM
Home > తాజా > పాతబస్తీలో ఉచిత జ్యూస్ తాగి..మత్తులోకి వెళ్ళిపోయి

పాతబస్తీలో ఉచిత జ్యూస్ తాగి..మత్తులోకి వెళ్ళిపోయి

Hyderabad Juice Horror | హైదరాబాద్ పాతబస్తీలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఖురాన్ పఠనం పూర్తయిన నేపథ్యంలో తన ఆనందాన్ని పంచుకోవడానికి ఉచిత జ్యూస్ పంపిణీ చేశాడు ఓ యువకుడు. అనంతరం జ్యూస్ తాగిన వారు మత్తులోకి జారుకున్నారు.

డబీర్ పూరా పోలీసు స్టేషన్ పరిధిలోని చంచల్ గూడ ప్రాంతంలో ఓ వ్యక్తి పలు దుకాణాలు, అపార్ట్మెంటులకు వెళ్లి తాను ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఉచిత జ్యూస్ పంపిణీ చేశాడు. ఈ క్రమంలో కొందరు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా జ్యూస్ ను స్వీకరించి తాగారు. మరికొందరు మాత్రం వద్దన్నారు.

అయితే జ్యూస్ తాగిన వారు సుమారు 12 నుంచి 15 గంటల పాటు మత్తులోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత నిద్రలేచినా అయోమయానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన డబీర్ పూరా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అతడు జ్యూస్ ఎందుకిచ్చాడు, అందులో ఏమి కలిపాడు అనే కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు బాధితుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions