Mohan Babu’s Stunning first look in ‘Paradise’ revealed | నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.
ఇందులో నాని మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నారు. ఆయన పేరు ‘జడల్’. ఇందుకు తగ్గట్టుగానే పెద్ద జడలతో నాని లుక్ గతంలో రిలీజ్ అయ్యింది. తాజగా ఈ మూవీకి సంబంధించి మరో సర్ప్రైజ్ పోస్టర్ విడుదల అయ్యింది.
పవర్ఫుల్ విలన్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కనిపించనున్నారు. ఈ క్రమంలో ఓ రగడ్ లుక్ ను మేకర్స్ తాజగా రిలీజ్ చేశారు. షర్ట్ లేకుండా చేతిలో తుపాకీ, కత్తి పట్టుకొని మరో చేతిలో సిగార్ కలుస్తూ ఉన్న మోహన్ బాబు లుక్ వైరల్ గా మారింది.
ది ప్యారడైజ్ మూవీలో ‘శికంజ మాలిక్’ గా మోహన్ బాబు అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమా విడుదల కానుంది. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.









