Ys Sharmila Son Rajareddy Political Entry News | ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశంపై జోరుగా చర్చ జరుగుతుంది.
అతి త్వరలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. కర్నూలు జిల్లా కేంద్రంలో సోమవారం షర్మిల ఉల్లి రైతులను పరామర్శించారు. అయితే ఆమె వెంట కుమారుడు రాజారెడ్డి సైతం ఉన్నారు.
కర్నూల్ పర్యటనకు వెళ్లే ముందు షర్మిల, తన తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజారెడ్డి సైతం అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న తల్లి షర్మిల వెంట బయలుదేరారు. షర్మిల మరియు రాజారెడ్డి కర్నూల్ ఉల్లి మార్కెట్ యార్డులో రైతులను పరామర్శించారు. ఈ క్రమంలో ఉల్లికి మద్దతు ధర కల్పించాలని షర్మిల డిమాండ్ చేశారు.
కాగా రాజారెడ్డి అమెరికాలో ఉన్నత చదువులు చదివారు. గతేడాదే ఆయన అట్లూరి ప్రియను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.









