Neymar to become a ‘Brazilianaire’ | తన అభిమాన ఆటగాడికి ఓ వ్యాపారవేత్త యావదాస్థిని రాసిచ్చేశాడు. బ్రెజిల్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ నెయ్‌మర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
కొందరు ఆయన్ను డెమీ గాడ్ గా కొలుస్తారు. ఈ క్రమంలో బ్రెజిల్‌లోని పోర్టో అలెగ్రికి చెందిన 31 ఏళ్ల వ్యాపారవేత్త, తన 6.1 బిలియన్ బ్రెజిల్ రియల్స్ అంటే దాదాపు రూ.10,000 కోట్లు విలువైన సంపదను నెయ్‌మర్‌కు వీలునామా ద్వారా ఇచ్చినట్లు బ్రెజిల్ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ వ్యాపారవేత్త ఇటీవల మరణించారని, ఆయనకు భార్య, పిల్లలు లేరని తెలుస్తోంది. ఈ వీలునామాను 2025 జూన్ 12న అధికారికంగా రిజిస్టర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యాపారవేత్తకు నెయ్‌మర్‌తో ఎలాంటి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సంబంధం లేకపోయినా, నెయ్‌మర్ పట్ల అభిమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నెయ్‌మర్ కు తన తండ్రితో ఉండే అనుబంధం తనకు స్ఫూర్తినిచ్చిందని సదరు అజ్ఞాత వ్యాపారవేత్త వీలునామాలో పేర్కొన్నారు.









