Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘పాక్ మహిళతో వివాహం..CRPF జవాన్ ఏమన్నారంటే!’

‘పాక్ మహిళతో వివాహం..CRPF జవాన్ ఏమన్నారంటే!’

Dismissed CRPF Jawan On Marrying Pakistani Women | పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం దౌత్య పరంగా పలు కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా పాక్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో CRPF 41వ బెటాలియన్ కు చెందిన జవాన్ మునీర్ అహ్మద్, పాకిస్థాన్ కు చెందిన మెనల్ ఖాన్ ను వివాహం చేసుకున్నాడనే విషయం బయటకు రావడం కలకలం రేపింది.

పాక్ మహిళను భారత జవాన్ గతేడాది మే నెలలో వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నాడు. అనంతరం మెనల్ ఖాన్ వీసా పై భారత్ చేరుకుంది. అయితే ఈ విషయాన్ని తమకు నివేదించకపోవడం మరియు వీసా గడువు ముగిసినా తర్వాత కూడా భారతదేశంలో ఉంచడం వల్ల జాతీయ భద్రతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ జవాన్ మునీర్ అహ్మద్ ను విధుల నుండి ఉన్నతాధికారులు తొలగించారు.

కానీ ఈ అంశంపై మునీర్ అహ్మద్ మరో రకంగా మాట్లాడుతున్నారు. పాక్ మహిళను వివాహం చేసుకున్న విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మునీర్ చెప్పారు. మెనల్ ఖాన్ తో 2022 నుండి ప్రేమ వ్యవహారం గురించి అధికారులకు ముందు నుండే చెప్తూ వస్తున్నట్లు పేర్కొన్నాడు.

తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు న్యాయం చేయాలని మునీర్ కోరుతున్నారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions