Mulugu News Latest | అక్క, మంత్రి సీతక్క ములుగు జిల్లా కేంద్రంలో బస్ స్టేషన్ కావాలని కోరింది, అక్క విజ్ఞప్తి మేరకు బస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నూతన బస్ స్టేషన్లు, డిపోల ఏర్పాట్లకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ములుగు జిల్లాలో బస్ డిపో లేదని ,బస్ డిపో మరియు ములుగు జిల్లా కేంద్రంలో బస్ స్టేషన్ కావాలని సీతక్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో సీతక్క విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి ములుగులో నూతన బస్ స్టేషన్ ఏర్పాటుకు అనుమతులిచ్చారు. ఈ క్రమంలో ఆదివారం ములుగులో మంత్రులు సీతక్క, పొన్నం కలిసి నూతన బస్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం స్పందిస్తూ..అక్క విజ్ఞప్తి మేరకు దాదాపు రూ.5 కోట్లతో పైన 4 షాపులు ,కింద 7 షాపులతో 4 వేల చదరపు అడుగులతో గ్రీనరీ ,తాగు నీటి వసతితో అధునాతనంగా బస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.









