Sunday 6th July 2025
12:07:03 PM
Home > తాజా > బ్రోకర్ చెంప చెళ్లుమనిపించిన ఈటల

బ్రోకర్ చెంప చెళ్లుమనిపించిన ఈటల

BJP MP Eatala Rajender slaps Medchal real estate agent | ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ( Real Estate Agent ) పై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ( Eatala Rajender )దాడి చేశారు.

మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని ఏకశీలానగర్ లో ఈటల మంగళవారం పర్యటించారు.

ఈ క్రమంలో బాధితులు సదరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఈటలకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి స్థలాల విషయంలో బ్రోకర్ ఇబ్బంది పెడుతున్నారని బాధితులు ఈటలకు చెప్పారు. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల బ్రోకర్ చెంప చెళ్లుమనిపించారు.

అనంతరం ఈ బీజేపీ ఎంపీ మాట్లాడుతూ..కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. దొంగ పత్రాలతో పేదల భూములు లాక్కుంటున్నారని పేర్కొన్నారు.

బ్రోకర్లకు సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెదల భూములకు బీజేపీ అండగా ఉంటుందని ఈటల తెలిపారు.

You may also like
సిగాచీ ప్రమాదం..జన్మదిన వేడుకలకు జగ్గారెడ్డి దూరం
‘హిందీ రుద్దలేరు..20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఠాక్రే సోదరులు’
‘ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సహాయం..అందులో నిజం లేదు’
ఇద్దరు కుమారులతో పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions