Friday 25th July 2025
12:07:03 PM
Home > క్రీడలు > కొలుకుంటున్న వినోద్ కాంబ్లీ.. ఆసుపత్రి సిబ్బందితో కలిసి స్టెప్పులేసిన మాజీ క్రికెటర్!

కొలుకుంటున్న వినోద్ కాంబ్లీ.. ఆసుపత్రి సిబ్బందితో కలిసి స్టెప్పులేసిన మాజీ క్రికెటర్!

vinod kamble

Vinod Kamble Video | టీమ్ండియా (Team India) మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ (Vinod Kamble) కొద్ది రోజుల కిందట తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన థానేలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వైద్య పరీక్షలు నిర్వహించగా అతని మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు డాక్టర్లు గుర్తించారు. చికిత్స తర్వాత కాంబ్లీ మెల్లగా కోలుకుంటున్నాడు.

తాజాగా ఆయన ఆసుపత్రి సిబ్బందితో కలిసి పాటలు పాడుతూ డ్యాన్స్ చేశాడు. ‘చక్ దే ఇండియా’ పాటకు స్టెప్పులేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సచిన్‌ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ మంచి స్నేహితులు. 1988లో స్కూల్ లెవెల్ క్రికెట్‌లో సచిన్-కాంబ్లీ జోడీ ప్రపంచ రికార్డు సృష్టించింది.

హారిస్‌ షీల్డ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి 664 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అందులో కాంబ్లీ 349 పరుగులు చేస్తే, సచిన్ 326 పరుగులు చేశారు. ఇద్దరూ నాటౌట్‌గా నిలిచారు.

https://twitter.com/niharikam_21/status/1873989170261315947
You may also like
మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే.. సోషల్ మీడియాలో కవిత పోస్ట్!
హరిహర వీరమల్లు రిలీజ్.. సీఎం చంద్రబాబు స్పెషల్ విషెస్!
‘తెలంగాణ వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేయాలి’
పవన్ సినిమాకు అంబటి రాంబాబు ఆల్ ది బెస్ట్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions