Minister Nara Lokesh | ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలపై వేగంగా స్పందిస్తూ, పరిష్కరం దిశగా చర్యలు తీసుకుంటుంటారు.
తాజాగా తాజాగా కాణిపాకం (Kanipakam) గణపతి ఆలయానికి సంబంధించి ఓ భక్తుడు మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశాడు. కిశోర్ అనే భక్తుడు స్వామివారి దర్శనం కోసం రూ.500 చెల్లించి సాధారణ ఆశీర్వచన టికెట్ తీసుకున్నారు.
ఈ టికెట్ కింద ఇద్దరు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఉంటుంది. కానీ రూ.500 చెల్లించిన ఒకరినే దర్శనానికి అనుమతిస్తామని కాణిపాకం సిబ్బంది ఒక్కరు కిషోర్ తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనను కిషోర్ ఎక్స్ వేదికగా నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన నారా లోకేష్ సంబంధింత మంత్రిని, ఆలయ ఈవోను విచారణకు ఆదేశించగా.. ఆరోపణలు నిజమని తేలటంతో ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు.