Rohit Sharma Lands In Australia | బోర్డర్-గావస్కర్ ( Border-Gavaskar ) ట్రోఫీలో భాగంగా పెర్త్ ( Perth ) వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెల్సిందే.
మూడవ రోజు ఆట జరుగుతున్న సమయంలోనే టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) పెర్త్ లో అడుగుపెట్టాడు. తన సతీమణి రితికా మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో రోహిత్ తొలి టెస్టుకు దూరం అయ్యాడు. అతని స్థానంలో బుమ్రా ( Jasprit Bumrah ) టీంను లీడ్ చేస్తున్నాడు. పెర్త్ టెస్టు జరుగుతున్న సమయంలోనే ఆస్ట్రేలియా చేరుకోవడంతో అడిలైడ్ వేదికగా జాతగబోయే రెండవ టెస్టులో రోహిత్ శర్మ ఆడడం ఖాయం అనిపిస్తుంది.
అయితే రెండవ టెస్టు కంటే ముందే ప్రైమ్ మినిస్టర్స్ XI టీంతో కాన్బెర్రా వేదికగా జరగబోయే వార్మప్ మ్యాచులో భారత్ ఆడనుంది. నవంబర్ 30 నుండి డిసెంబర్ 1 వరకు జరిగే ఈ మ్యాచులో రోహిత్ పాల్గొనే అవకాశం ఉంది.









